దివి ఇలవేల్పు లంకమ్మ జాతర నేడు
ABN , First Publish Date - 2023-04-05T01:04:57+05:30 IST
దివి ప్రాంత వాసుల ఇలవేల్పు లంకమ్మ వార్షిక జాతర బుధవారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి రామదాసు, ఈవో సీతారామయ్య తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుం దరంగా అలంకరించారు.
అవనిగడ్డ టౌన్ : దివి ప్రాంత వాసుల ఇలవేల్పు లంకమ్మ వార్షిక జాతర బుధవారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అన్నపరెడ్డి రామదాసు, ఈవో సీతారామయ్య తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుం దరంగా అలంకరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రత్యేకమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అవనిగడ్డ డిఎస్పీ మెహబూబ్ బాషా, సీఐ శ్రీనివాస్ తెలిపారు.