Share News

28నాటికి ఆర్‌యూబీని అందుబాటులోకి తెండి

ABN , First Publish Date - 2023-11-09T00:13:34+05:30 IST

మధురానగర్‌ ఆర్‌యూబీ నిర్మాణ పనులను ఈ నెల 28 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను అదేశించారు.

28నాటికి ఆర్‌యూబీని అందుబాటులోకి తెండి
అధికారులకు సూచనలు ఇస్తున్న నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

28నాటికి ఆర్‌యూబీని అందుబాటులోకి తెండి

నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌

మఽధురానగర్‌, నవంబరు 8: మధురానగర్‌ ఆర్‌యూబీ నిర్మాణ పనులను ఈ నెల 28 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ అధికారులను అదేశించారు. బుధవారం ఆయన మధురానగర్‌ పర్యటనలో భాగంగా ఆర్‌యూబీ పనులు జరుగుతున్న చోటకు వచ్చి పనుల పురోగతిని పరిశీలించారు. కనెక్టింగ్‌ బ్రిడ్జి, ఆర్‌యూబీ లోపల రోడ్డు, లైటింగ్‌, మిగిలిన రిటైనింగ్‌ వాల్‌ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఒక పని తరువాత ఒకటి అనే విధానంలో కాకుండా పనివాళ్లను పెంచి అన్ని పనులను సమాంతరంగా వేగంగా చేపట్టాలని గట్టిగా చెప్పారు. ఈనెల 28 నాటికి ఆర్‌యూబీ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డెడ్‌ లైన్‌ విఽధించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, ఇంజనీరింగ్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-11-09T00:13:37+05:30 IST