Assembly.. ప్రతి పక్షం ఇచ్చిన వాయిదా తీర్మాణం వేరే ఫార్మెట్‌లో వస్తే చర్చిస్తాం: బుగ్గన
ABN , First Publish Date - 2023-09-21T10:10:55+05:30 IST
అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే ల నిరసనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.
అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ప్రతి పక్షం ఇచ్చిన వాయిదా తీర్మాణంను వేరే ఫార్మెట్‌లో వస్తే చర్చిస్తామన్నారు. ఈ విషయంపై తాము చర్చకు సిధ్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. అర్ధం పర్దం లేని వాయిదా తీర్మాణం ఇస్తున్నారని, దీనిపై చట్టపరంగా న్యాయ విచారణ జరుగుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్దే ఆందోళనలు చేపట్టారు.
అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చైర్‌పై గౌరవం లేకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌజ్‌ను ఆర్డర్‌లో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి జోక్యం చేసుకుని అవాంఛనీయ సంఘటనలకు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీని వాళ్ళు రెచ్చగొడుతున్నారని, వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మంత్రి స్పీకర్‌కు కోరారు.