Home » AP Assembly Budget Sessions
అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సందర్బంగా 10 రోజుల పాటు సభలో జరిగిన వివిధ అంశాలను ఆయన వివరించారు.
ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.
పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.
త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభ్యులకు ధీటుగా సభలో అనిత సమాధానమిచ్చారు. అయితే మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది.
Andhra Pradesh Assembly Budget Session Live Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.