మోపిదేవి ఆలయం హోదా డీసీ స్థాయికి పెంపు
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:20 AM
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆలయ ఈవో ఎన్.ఎ్‌స.చక్రధరరావు శనివారం విలేకరులకు తెలిపారు.
మోపిదేవి, డిసెంబరు 30 : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆలయ ఈవో ఎన్.ఎ్‌స.చక్రధరరావు శనివారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆదాయ పరిమితి మేరకు అప్‌గ్రేడ్ చేస్తూ దేవదాయశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దేవస్థానం వార్షిక ఆదాయం రూ.10 కోట్లను దాటడంతో దేవాలయాన్ని డిప్యూటీ కమిషనర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. దేవదాయ మంత్రికి, ఉన్నతాధికారులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.