ఉధృతంగా మునేరు
ABN , First Publish Date - 2023-07-22T01:48:25+05:30 IST
రెండు, మూడు రోజులుగా ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మునేరు ఉధృతమైంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. లింగాల వద్ద బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రా, తెలంగాణాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
వత్సవాయి/పెనుగంచిప్రోలు, జూలై 21 : రెండు, మూడు రోజులుగా ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మునేరు ఉధృతమైంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 10 అడుగులకు చేరింది. లింగాల వద్ద బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రా, తెలంగాణాల మధ్య రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వరద నిలకడగా ఉందని, మునేరు జేఈ రామ నరసింహ తెలిపారు. ఇక పెనుగంచిప్రోలు వద్దకు మునేరు వరద చేరింది. దీంతో తిరుపతమ్మ దేవస్థానం వద్ద లోతట్టు ప్రాంతంలో, మునేటి కాజ్‌వే వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తహసీల్దార్ కె.లక్ష్మి కల్యాణి పర్యవేక్షణలో రెవెన్యూ, ఎస్సై సీహెచ్ కనకదుర్గా ప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.