నేత్రపర్వం..శాకంబరీ ఉత్సవం

ABN , First Publish Date - 2023-07-03T01:00:27+05:30 IST

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్స వాలు రెండో రోజు ఆదివారం నేత్రపర్వంగా కొనసా గాయి

నేత్రపర్వం..శాకంబరీ ఉత్సవం
శాకంబరి అలంకరణలో దుర్గమ్మ

రెండోరోజు దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

వన్‌టౌన్‌, జూలై 2: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్స వాలు రెండో రోజు ఆదివారం నేత్రపర్వంగా కొనసా గాయి. శ్రీగౌరి సప్తశతీ పారాయణం, మహావిద్యాపారాయణం, హోమాలు వేదోక్తంగా కొనసా గాయి. అర్చక స్వాములు మూల మంత్ర హవనాలు, మండప పూజలు, హారతి, మంత్ర పుష్ఫం, ప్రషాద వితరణలు నిర్వహించారు. భక్తులకు కదంబ ప్రసాదం అందించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటె త్తారు. క్యూ లైన్లలోని భక్తులను ఈవో భ్రమరాంబ, ఏఈవో చందశేఖర్‌ నియంత్రించారు. అమ్మవారి శీఘ్రదర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. దుర్గమ్మకు సారె సమర్పణలు కొనసాగాయి.

దుర్గమ్మ సేవలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

కనకదుర్గమ్మను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు, ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ వారికి స్వాగతం పలికారు. ఆల్‌ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌, కృష్ణాజిల్లా బ్రాహ్మణ సంఘం సారె సమర్ప ణలో విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అన్నదానానికి రూ.లక్ష విరాళం

గన్నవరం సమీపంలోని బీబీగూడేనికి చెందిన కె.వెంకటసత్యం, కుటుంబ సభ్యులు ఆరాధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్పు, ఆరాధ్య మాచినేని పేరిట అన్నదానం నిర్వహించేందుకు రూ.1,01,116ను ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబుకు అందించారు.

Updated Date - 2023-07-03T01:00:27+05:30 IST