శకపురుషుడికి ఘన నివాళి

ABN , First Publish Date - 2023-05-29T00:14:58+05:30 IST

శకపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శకపురుషుడికి ఘన నివాళి

వాడవాడలా ఎన్టీఆర్‌ శత జయంతి

పేదలకు అన్నదానం, దుస్తుల పంపిణీ

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : శకపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని ప్రాంతాల్లో పేదలకు అన్నదానంతో పాటు నూతన వస్త్రాలను అందజేశారు. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరులో ఆరువేల మందికి అన్నదానం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు, గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి రావి వెంక టేశ్వరరావు, టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము, కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు. గ్రామస్థులు 300 మందికిపైగా టీడీపీలో చేరారు. మచిలీపట్నం బస్టాండ్‌ సెంటరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు కొనకళ్ల నారాయణరావు, గొర్రెపాటి గోపిచంద్‌, గోపుసత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, కాగిత గోపాలరావు, ఇలియాస్‌ పాషా, పిప్పళ్ల కాంతారావు పాల్గొని కేక్‌కట్‌ చేశారు. 100 మంది మహిళలకు చీరలు అందజేశారు. అవనిగడ్డలో నాగాయలంక, చల్లపల్లి అవనిగడ్డ, మోపిదేవి ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఘంటసాల మండలంలోని తాడేపల్లిలో ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో మాజీమంత్రి మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొని కేక్‌కట్‌ చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాతున్నవారిని సత్కరించారు. పెడన నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడు అర్జా నగేష్‌ ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని కూడూరు, నందమూరు, గౌడపాలెం తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. పామర్రు నియోకవర్గంలో ఎన్టీఆర్‌ శతజయతి కార్యక్రమాన్ని పామర్రు, నిమ్మకూరు గ్రామాల్లోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పామర్రు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వర్గ కుమార్‌రాజా నివాళులర్పించారు.

Updated Date - 2023-05-29T00:14:58+05:30 IST