ముంపులోనే వరి పొలాలు
ABN , First Publish Date - 2023-12-08T00:41:11+05:30 IST
‘‘ఇంతటి నిర్లక్ష్యపు ప్రభు త్వాన్ని మునుపెన్నడూ చూడలేదు. తుఫాన్ తీరం దాటి మూడు రోజులవు తున్నా నష్ట పరిహారం అంచనా వేసేందుకు ప్రభుత్వ అధికారులు రాలేదు. ఇరిగేషన్ అధికారులు ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది.’’ అని పెనమ లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్, జనసేన పార్టీ సమ న్వయకర్త ముప్పా రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు.
నష్ట పరిహారం అంచనా వేయని అధికారులు
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
ప్రొద్దుటూరు (కంకిపాడు), డిసెంబరు 7: ‘‘ఇంతటి నిర్లక్ష్యపు ప్రభు త్వాన్ని మునుపెన్నడూ చూడలేదు. తుఫాన్ తీరం దాటి మూడు రోజులవు తున్నా నష్ట పరిహారం అంచనా వేసేందుకు ప్రభుత్వ అధికారులు రాలేదు. ఇరిగేషన్ అధికారులు ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది.’’ అని పెనమ లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్, జనసేన పార్టీ సమ న్వయకర్త ముప్పా రాజా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొద్దు టూరు, ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు, యార్లగడ్డ గ్రామాల్లో తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులను వారు పరామర్శించారు. ప్రొద్దుటూరులో కౌలు రైతు ప్రొద్దుటూరు సుబ్బారావు 8ఎకరాలు వరిసాగు చేస్తే పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ తీవ్రంగా నష్ట పరిచిందన్నారు. వివరాలు నమోదు చేసుకునేందుకు ఇప్పటివరకు అధికా రులు తన వద్దకు రాలేదంటూ సుబ్బారావు తెలిపారని బోడె ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తుమ్మలపల్లి హరికృష్ణ, సుదిమళ్ల రవీంద్ర, పావనమూర్తి, కోటేశ్వరరావు, సతీష్, యార్లగడ్డగూడెం నాని, కొండ, పులి శ్రీని వాసరావు, డీఎన్‌ఆర్, జనసేన నాయకులు రంజిత్, తాతపూడి గణేష్, కె.సురేష్, వడ్డీ జీవ, జి.వినయ్, బోయిన నాగరాజు, సుంకర శివ, రాజా, కుంటా గంగాధర్, అయ్యప్ప పాల్గొన్నారు.