అకాల వర్షాలకు దెబ్బతిన పంట పరిశీలన
ABN , First Publish Date - 2023-05-09T00:44:48+05:30 IST
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని గన్నవరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. సునీల్ అన్నారు. పెద ఓగిరాలలో సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు.

పెదఓగిరాల(ఉయ్యూరు), మే 8 : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని గన్నవరం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. సునీల్ అన్నారు. పెద ఓగిరాలలో సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. మొక్కజొన్న, పసుపు, వరి పంట లు 33 కంటే ఎక్కువ శాతం నష్టం వాటిల్లితే పంట నష్టం నమోదు చేస్తామ న్నారు. ఆరబెట్టిన మొక్కజొన్న మొలక రాకుండా 5 శాతం ఉప్పు నీరు, ప్రొపైకొ నకోల్ ద్రావణం పిచికారీ చేయాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రైతు భరోసా కేంద్రంలో ముందుగా సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, క్వింటాకు రూ. 1962 ధర ఉందని, నాణ్యత ప్రమాణాలతో కొనుగోళ్లు చేస్తామని వివరించారు. మండల వ్యవసాయ అధికారి బి.నిస్సీగ్రేస్, వీహెచ్‌ఏ పి. హేమ తదితరులు పాల్గొన్నారు.