స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు
ABN , First Publish Date - 2023-05-28T01:27:29+05:30 IST
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 30 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే ఖాళీగా ఉన్న 170 ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తూ భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మచిలీపట్నం టౌన్, మే 27 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 30 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శనివారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే ఖాళీగా ఉన్న 170 ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తూ భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఈవో తాహెరా సుల్తానా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల స్నేహితులతో డీఈవో కార్యాలయం సందడిగా మారింది.
ఫ హెచ్‌ఎంల పదోన్నతులకు 30 మంది సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను పిలవగా 27 మంది మాత్రమే ప్రధానోపాధ్యాయులుగా తమ అంగీకారం తెలియచేశారు. అంగీకారం ఇచ్చిన 27 మందికి పదోన్నతి కల్పించారు. మరో ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించాల్సి ఉంది.
ఫ ఖాళీగా ఉన్న 170 ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన 823 మంది సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లను కౌన్సెలింగ్‌కు పిలిచారు. వీరిలో 206 మంది హాజరయ్యారు. 40 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి ఆమోదం తెలపలేదు. ఆమోదం తెలిపిన 166 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్లుగా డీఈవో పదోన్నతి కల్పించారు. మిగిలిన ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు డీఈవో తెలిపారు.
బదిలీల్లో స్పౌజ్ దుర్వినియోగం
డీఈవోకు ఎస్టీయూ ఫిర్యాదు
ఉపాధ్యాయుల బదిలీల్లో స్పౌజ్ దుర్వినియోగం చేసుకునేందుకు కొందరు టీచర్లు ప్రయత్నిస్తున్నారని డీఈవో తాహెరా సుల్తానాకు ఎస్టీయూ నేతలు కె.మాధవరావు, కొమ్ము ప్రసాద్‌లు ఫిర్యాదు చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాల సర్వీసు పూర్తి కాకుండా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే వారు స్పౌజ్ కేటగిరిలో నమోదు చేస్తూ అధిక పాయింట్లు పొందుతున్నారని, మండల విద్యాశాఖాధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఇలా అధిక మార్కులు సాధిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు.