రెజీనా మరణం మహిళా లోకానికి తీరని లోటు

ABN , First Publish Date - 2023-09-13T00:34:26+05:30 IST

మారిస్‌ స్టెల్లా కళాశాల విశ్రాంత తెలుగు రీడర్‌ డాక్టర్‌ రెజీనా మరణం మహిళా లోకానికి తీరని లోటని జనశిక్షణా సంస్థాన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగ ళ్ల విద్యాఖన్నా చెప్పారు.

రెజీనా మరణం మహిళా లోకానికి తీరని లోటు
మాట్లాడుతున్న జనశిక్షణా సంస్థాన్‌ చైర్‌పర్సన్‌ విద్యాఖన్నా

రెజీనా మరణం మహిళా లోకానికి తీరని లోటు

జనశిక్షణా సంస్థాన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగ ళ్ల విద్యాఖన్నా

మొగల్రాజపురం, సెప్టెంబరు 12: మారిస్‌ స్టెల్లా కళాశాల విశ్రాంత తెలుగు రీడర్‌ డాక్టర్‌ రెజీనా మరణం మహిళా లోకానికి తీరని లోటని జనశిక్షణా సంస్థాన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగ ళ్ల విద్యాఖన్నా చెప్పారు. డాక్టర్‌ రెజీనా సంస్మరణ సభ జనశిక్షానా సంస్థాన్‌ డైరెక్టర్‌ ఎ. పూర్ణిమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పైగా తెలుగు రీడర్‌గా సేవలు అందించిన ఆమె మహిళ సమస్యలపట్ల పోరాటాలతో పాటు బోధనా రంగంలో ఆమె అనుసరించిన విధానాలు మరవలేనివన్నారు. రావి శారద మాట్లాడుతూ మహిళల సమస్యల పట్ల పోరాటానికి రెజీనా ఎప్పుడూ ముందుండేవారన్నారు. ఐద్వా ప్రతినిధి రమాదేవి, పెనుమత్స దుర్గాభవాని, వాణి, జ్యోత్స్నలు మాట్లాడుతూ రెజీనా జీవితం నేటి మహిళలకు, యువతులకు ఎంతో ఆదర్శనీయం అన్నారు. కార్యక్రమానికి ముందు రెజీనా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరుణీ తరంగాలు సభ్యులు, స్టెప్‌ ఎ హెడ్‌ ఫర్‌ ఈక్వాలిటీ సభ్యులు, బాలోత్సవ్‌ సభ్యులు, జనశిక్షణా సంస్థాన్‌ సిబ్బంది, శిక్షకులు, శిక్షణార్ధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-13T00:34:26+05:30 IST