వైసీపీ వైఫల్యాలను వివరించండి : మండలి

ABN , First Publish Date - 2023-03-07T00:51:20+05:30 IST

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ వివరించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు.

వైసీపీ వైఫల్యాలను వివరించండి : మండలి

మోపిదేవి, మార్చి 6 : ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికీ వివరించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు. మండల టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సోమవారం మోపిదేవిలోని డాక్టర్‌ మండవ సాయి ప్రాంగణంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు మోపిదేవి మండలంలో చురుగ్గా సాగకపోవటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో మోపిదేవి మండలం అన్ని విధాలుగా వెనుకబడి ఉందన్న విషయం గుర్తించాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలకు మరికొద్ది కాలమే ఉన్నందున పార్టీ నాయకత్వం చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు నడకుదుటి జనార్దనరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, సర్పంచ్‌ పొలిమేట్ల ఏసుబాబు, తెలుగుమహిళా అవనిగడ్డ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మోర్ల జయలక్ష్మి, మండల అధ్యక్షురాలు మాతంగి వెంకటేశ్వరమ్మ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుంగధరి తదితరులు పాల్గొన్నారు.

పలువురికి బుద్ధప్రసాద్‌ పరామర్శ

అవనిగడ్డ టౌన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, సమితి మాజీ ప్రెసిడెంట్‌ అన్నపరెడ్డి సత్యనారాయణ సతీమణి అన్నపరెడ్డి సుఖవేణమ్మ మృతి చెందారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సోమవారం సత్యనారాయణని పరామర్శించారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, ఘంటసాల రాజమోహనరావు, అన్నపరెడ్డి లక్ష్మణ, కోట సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాగాయలంక : నాగాయలంకలో గద్దె ఉదయలక్ష్మి, కనిగంటి నాగమల్లేశ్వరి, కైతేపల్లి లూదియమ్మ, రేమాల రామచంద్రరావు ఇటీవల మృతి చెందారు. ఆయా కుటుం బ సభ్యులైన కైతేపల్లి అంకాలు, కనిగంటి నారాయణ, రేమాల బాబురావులను సోమవారం మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మండవ బాలవర్థిరావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, ఉప్పల ప్రసాద్‌, లకనం నాగాంజనేయులు, తలశిల శివరామకృష్ణ, నాగిడి తాతారావు, తలశిల రఘుశేఖర్‌, మంచాల మహేంద్ర కుమార్‌ రాజా, ఉప్పల బుజ్జి తదితరులు పరామర్శించారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Updated Date - 2023-03-07T00:51:20+05:30 IST