వీడని వాన.. అన్నదాత విలవిల!
ABN , First Publish Date - 2023-03-21T00:53:14+05:30 IST
శనగపాడు, వెంగనాయకునిపాలెం, కొల్లికుళ్ల, వెంకటాపురం గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి కల్లాలపై కప్పిన పట్టాలపై నీరు చేరడంతో పాటు కొన్ని చోట్ల మిర్చి తడవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. సోమవారం ఉదయం వర్షం నీరు నిలబడిన పట్టాలను తొలగించి సాయంత్రం వరకు రైతులు మిరపకాయలను ఆరబెట్టుకున్నారు.
పెనుగంచిప్రోలు, మార్చి 20 : శనగపాడు, వెంగనాయకునిపాలెం, కొల్లికుళ్ల, వెంకటాపురం గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మిర్చి కల్లాలపై కప్పిన పట్టాలపై నీరు చేరడంతో పాటు కొన్ని చోట్ల మిర్చి తడవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. సోమవారం ఉదయం వర్షం నీరు నిలబడిన పట్టాలను తొలగించి సాయంత్రం వరకు రైతులు మిరపకాయలను ఆరబెట్టుకున్నారు. తిరువూరు : పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో ఉసోమవారం రుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వడగళ్లతో భారీ వర్షం పడటంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న డ్రెయిన్‌తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బైపాస్ జంక్షన్‌లో ప్రధానరహదారిలో మూడు అడుగుల మేర వర్షం నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలులకు పిటికొత్తూరులో ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. కోకిలంపాడు, నడింతిరువూరు ప్రాంతాల్లోని వరిపైరును ఏవో పద్మ పరిశీలించారు.
కట్టలేరుకు వరద..
గంపలగూడెం/వీరులపాడు: నాలుగు రోజులుగా ఎగువ తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోటమూల - వినగడప రహదారిలో కట్టలేరు బ్రిడ్జ్ డైవర్షన్ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆదివారం రాత్రి నుంచి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. పల్లంపల్లి వద్ద వైరా కట్టేలేరు దాటుతున్న ఉపాధ్యాయుడు వరద ప్రవాహంలో చిక్కుకోగా స్థానికులు తాడు సాయంతో కాపాడారు. జయంతి ఎంపీపీఎస్ ఎస్సీకాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.ఆదాం పాఠశాల ముగిసిన అనంతరం ద్విచక్ర వాహనంపై నందిగామలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు కట్టేలేరు దాటుతుండగా వరద ఉధృతి పెరిగి వాహనంతో సహా కొట్టుకుపోయారు. వంతెన పిల్లర వద్ద ఆగిపోవడంతో స్థానికులు గమనించి తాడు సాయంతో రక్షించారు. గ్రామస్థులను ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలిపాయి.