నీరందక ఎండిపోతున్నాయ్‌!

ABN , First Publish Date - 2023-08-17T01:04:47+05:30 IST

ఖరీఫ్‌ సాగు కష్టాలు రైతులను వెంటాడు తున్నాయి. సాగునీరు అందక వేసిన పంట నిలువునా ఎండిపోతున్నా రైతులు ఏమీ చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు.

నీరందక ఎండిపోతున్నాయ్‌!
నందిగంలో నీరులేక ఎండుతున్న వరి చేను

పెడన రూరల్‌: ఖరీఫ్‌ సాగు కష్టాలు రైతులను వెంటాడు తున్నాయి. సాగునీరు అందక వేసిన పంట నిలువునా ఎండిపోతున్నా రైతులు ఏమీ చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. మొదట్లో అధిక వర్షా లతో వెదజల్లిన విత్తనాలు మొలక దశలోనే మునిగి కుళ్లిపోయాయి. దీంతో వేలాది రూపాయలను నష్టపోయారు. అయినా ఆశ వదులు కోలేక మళ్లీ నారుతెచ్చి నాట్లువేశారు. నందిగం న్యూబీఎస్‌ కాల్వకు సాగునీరు సరఫరా కాక నందిగం, దావోజిపాలెం, దిరిశవల్లి, ఎస్‌వీ పల్లి గ్రామాల్లోని వందలాది ఎకరాల్లో పైరు నిలువునా ఎండి పోతోం దని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారులు నీరందించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-08-17T01:04:47+05:30 IST