ప్రజాస్వామ్య పరిరక్షణకు జై భారత్‌ సత్యాగ్రహ సభ

ABN , First Publish Date - 2023-04-23T00:53:39+05:30 IST

దేశంలో ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న సాయంత్రం 3 గంటలకు నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో జై భారత్‌ సత్యాగ్రహ సభను నిర్వహిస్తున్నట్లు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు అన్నారు.

 ప్రజాస్వామ్య పరిరక్షణకు   జై భారత్‌ సత్యాగ్రహ సభ
మాట్లాడుతున్న నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరసింహారావు

ప్రజాస్వామ్య పరిరక్షణకు

జై భారత్‌ సత్యాగ్రహ సభ

నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరసింహారావు

భవానీపురం, ఏప్రిల్‌ 22: దేశంలో ప్రజాస్వా మ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న సాయంత్రం 3 గంటలకు నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌లో జై భారత్‌ సత్యాగ్రహ సభను నిర్వహిస్తున్నట్లు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. చలో జింఖానా గ్రౌండ్స్‌ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ఆయన కుమ్మరిపాలెం, విద్యాధరపురంల్లో పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకున్నారు. అనంతరం నాలుగు స్థంభాల సెంటర్‌లో బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు వీరంకి రామచంద్రరావుతో కలిసి శనివారం విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ మత్మోనాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్‌ గాంధీని అక్రమ కేసులో ఇరికించడం దుర్మార్గమన్నారు. జింఖానా గ్రౌండ్స్‌లో జరిగే సత్యాగ్రహ సభలో మేధా వులు, కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు పాల్గొని మద్దతు పలకాలని నరసింహారావు కోరారు. కార్యక్ర మంలో రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షులు వి. గురునాథం, నగర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు అన్సారీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-23T00:53:39+05:30 IST