రైతును ఆదుకోమంటే బెదిరింపులా!
ABN , First Publish Date - 2023-05-12T01:10:34+05:30 IST
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించి ఆదుకోమని కోరటం తప్పెలా అవుతుందని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్ రాజా ప్రశ్నించారు.

తోట్లవల్లూరు, మే 11 : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించి ఆదుకోమని కోరటం తప్పెలా అవుతుందని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్ రాజా ప్రశ్నించారు. మండలంలోని చినపులిపాక, బొడ్డపాడు గ్రామాల్లో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఆయన నిర్వహించారు. తడిసి పాడైన ఓ రైతుకు చెందిన ఆరెకరాల మొక్కజొన్న పంటను కుమార్ రాజా పరిశీలించారు. అనంతరం కుమార్ రాజా మా ట్లాడుతూ తాము ఆపదలో ఉన్న రైతులను ఓదార్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. తనలో ఒక కోణమే చూశారని, రెండో కోణం చూస్తే తట్టుకోలేరంటూ రైతు లను ఓదార్చిన తనను ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ హెచ్చరించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం తగునా అని కుమార్ రాజా అన్నారు. కలెక్టర్‌ను తీసుకొచ్చి పంటల పరిశీలన చేసినప్పటికీ రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. ఫ్రస్టేషన్‌తో మాట్లాడటం ఆపి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయటంతో పాటు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇప్పించేందుకు సీఎం జగన్‌ను ఎమ్మెల్యే ఒప్పించాలని సవాల్ చేశారు. బొడ్డపాడు సర్పంచ్ మూడే శివశంకరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరామ్‌ప్రసాద్, మాజీ సర్పంచ్‌లు నిమ్మగడ్డ సీతారాంబాబు, భీరం విజయ రామ్మోహన్‌రావు, టీడీపీ నాయకులు కనగాల వెంకట సత్యనారాయణ(చంటి), కాగిత శ్రీనివాసరావు, ధర్మారావు తిరుపతయ్య పాల్గొన్నారు.