చే గువేరా వారసులకు స్వాగతం
ABN , First Publish Date - 2023-01-24T00:34:06+05:30 IST
విప్లవ యోధుడు చే గువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, మనువరాలు ప్రొఫెసర్ ఎస్తోఫానియా గువేరాకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
గన్నవరం, జనవరి 23 : విప్లవ యోధుడు చే గువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా, మనువరాలు ప్రొఫెసర్ ఎస్తోఫానియా గువేరాకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడలో జరిగే క్యూబా సంఘీభావ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వారు ఇండిగో విమానంలో సోమవారం ఇక్కడికి విచ్చేశారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గాన విజయవాడ వెళ్లారు.