పోలీసు స్పందనకు 90 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2023-08-29T00:03:41+05:30 IST

స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.కృష్ణకాంత్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోలీసు స్పందనకు 90 ఫిర్యాదులు
ఎస్పీకి సమస్యలు విన్నవిస్తున్న బాధితులు

కర్నూలు, ఆగస్టు 28: స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి.కృష్ణకాంత్‌ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి 90 ఫిర్యాదులు వచ్చాయి. ఈశ్వర్‌ ఇన్‌ఫ్రా వారి నుంచి ఒక ప్లాట్‌ కొనుగోలు నిమిత్తం రూ.10 లక్షలు ఇచ్చాము. కానీ ప్లాట్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు అడిగినప్పుడు ఏదో కారణం చెబుతూ మోసం చేస్తున్నారని గురుబ్రహ్మ నగర్‌కు చెందిన సరోజ ఫిర్యాదు చేశారు. ఏకాంబ రమూర్తి నాకు లోన్‌ ఇప్పిస్తానని చెప్పి.. సీబీఎల్‌ స్కోర్‌ తక్కువ ఉంది. లోన్‌ రావడం కష్టమేనని చెప్పి రూ.లక్ష తీసుకుని నీకు సిబిల్‌ స్కోర్‌ పెంచి లోను ఇప్పిస్తామని, లోన్‌ ఇప్పించకుండా మోసం చేశాడని కర్నూలు రేడియోస్టేషన్‌ దగ్గర ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన కురువ నాగేంద్రుడు ఫిర్యాదు చేశారు. పంచాయతీ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి బడి పిల్లలకు దారి లేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆస్పరి మండలం పలు కూరు బండ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ విన్నవించారు. సర్వేయర్‌ కేవీ సుబ్బారెడ్డి అనే వ్యక్తి నా పొలానికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హద్దు రాళ్లు ఏర్పాటు చేశారని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన ఫయాజ్‌బాషా ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో ఆఫీసులో అటెండరు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని సి.బెళగల్‌ మండలానికి చెందిన షేక్షావలి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆఫీసులో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని మోసం చేశాడని సీ.క్యాంపు చెందిన బి.సంతోష్‌ నాయక్‌ ఫిర్యాదు చేశారు. స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులపై త్వరగా పరిష్క రిస్తామని ఎస్పీ జి.కృష్ణకాంత్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూ షణం, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-29T00:03:41+05:30 IST