అశ్వవాహనంపై ఆది దంపతులు
ABN , First Publish Date - 2023-01-18T22:50:01+05:30 IST
శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి.
ఫముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, జనవరి 18ః శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ పాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపైౖ ఆశీనులను చేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. పూజల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు. ఉత్సవం ఎదుట కళాకారులు, డప్పు వాయిద్యాలు, కళాకారుల శంఖు, డమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో కార్యక్రమంలో దేవస్థానం ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫపుష్పోత్సవం, శయనోత్సవం
ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు పుష్పోత్సవం కార్యక్రమాన్ని జరిపారు. పుష్పోత్సవంలో 35 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలు వినియోగించారు. అదేవిధంగా 9 రకాల ఫలాలు నివేదించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఏకాంతసేవచేసి శయనోత్సవం నిర్వహించారు.