‘కత్తెర పురుగును నివారించాలి’
ABN , First Publish Date - 2023-12-08T00:06:46+05:30 IST
జొన్న, మొక్కజొన్న పంటలలో వచ్చే కత్తెర పురుగును నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు సూచించారు.
శిరివెళ్ల, డిసెంబరు 7: జొన్న, మొక్కజొన్న పంటలలో వచ్చే కత్తెర పురుగును నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు సూచించారు. మండలంలోని గోవిందపల్లె గ్రామంలో రైతులు సాగు చేసిన పంటలను ఆయన గురువారం పరిశీలించారు. కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వినియోగించాల్సిన పురుగుమందుల గురించి ఆయన రైతులకు వివరించారు. అనంతరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా గ్రామానికి చెందిన రైతు చిన్న కాశన్న పంట పొలంలో నాలుగో వరి పంటకోత ప్రయోగాన్ని నిర్వహించగా 16.560 కేజీల దిగుబడి వచ్చిందన్నారు.