విద్యుదాఘాతంతో బర్రెల కాపరి మృతి
ABN , First Publish Date - 2023-07-21T23:23:37+05:30 IST
మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన బర్రెల కాపరి పాములేటి(29) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
మహానంది, జూలై 21: మహానంది మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన బర్రెల కాపరి పాములేటి(29) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శుక్రవారం ఆయన బర్రెలను మేపుకొనేందుకు గ్రామ సమీపంలోని బసవాపురం ఖాళీ బీడు పొలాల్లోకి వెళ్ళాడు. అక్కడ విద్యుత స్తంభానికి ఏర్పాటు చేసిన ఎర్త్ కేబుల్‌కు తగిలాడు. ఆ వైర్‌లో విద్యుత ప్రసరిస్తున్నందు వల్ల పాములేటి అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.