‘రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలి’

ABN , First Publish Date - 2023-02-16T00:39:11+05:30 IST

రద్దు చేసిన సంక్షేమ పథ కాలను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వ సెక్రటరీ (ప్లానింగ్‌) జీఎస్‌ ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయ కులు విజ్ఞప్తి చేశారు.

‘రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించాలి’
ప్రభుత్వ సెక్రటరీకి వినతిపత్రం ఇస్తున్న అనంతరత్నం మాదిగ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 15: రద్దు చేసిన సంక్షేమ పథ కాలను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వ సెక్రటరీ (ప్లానింగ్‌) జీఎస్‌ ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయ కులు విజ్ఞప్తి చేశారు. బుధవారం మౌర్యఇన్‌ పరిణయ హాలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు కార్పొరేషన్ల ద్వారా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలి పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ పేద పిల్లలకు బెస్ట్‌ అవైలబుల్‌ పథకం ద్వారా ఉచిత కార్పొరేట్‌ విద్య నందించడంతో ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం ఉండే దని అన్నారు. అయితే ఈ పథకాన్ని అర్ధాంతరంగా రద్దు చేయడంతో ముఖ్యంగా పేద పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. బెస్టు అవైలబుల్‌ స్కీమ్‌ను మరలా ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ పిల్లలకు నాణ్యమైన కార్పొరేట్‌ విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలో ఎస్సీ కులాల వారిపై అధికంగా దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2023-02-16T00:39:14+05:30 IST