Share News

క్రిస్మస్‌కు ముస్తాబైన చర్చిలు

ABN , Publish Date - Dec 25 , 2023 | 12:35 AM

క్రిస్మస్‌ సంబరాలకు పట్టణంలోని చర్చిలు ముస్తాబయ్యాయి.

క్రిస్మస్‌కు ముస్తాబైన చర్చిలు
మంత్రాలయం మండలం మాధవరంలో ముస్తాబైన చర్చి

ఎమ్మిగనూరు, డిసెంబరు 24: క్రిస్మస్‌ సంబరాలకు పట్టణంలోని చర్చిలు ముస్తాబయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వెలసిన చర్చిలను క్రైస్తవులు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ప్రధానంగా పట్టణంలోని కలుగోట్లరోడ్డులో ఉన్న ఎంబీ ఎరుషలేం చర్చి, ఆర్సీఎం చర్చి, సెయింట్‌ ఆం డ్రూస్‌ సీఎ్‌సఐ టౌన్‌చర్చి, సెయింట్‌పాల్‌, బేతేల్‌ ప్రార్థనా మందిరం, సీఆర్సీసీ, క్రిస్టియన్‌ అసెంబ్లీ చర్చిలను అలంకరించారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా సోమవారం జరిగే ప్రత్యేక పార్థనలకు ఏర్పాట్లు చేశారు.

మంత్రాలయం: మంత్రాలయం, మాధవరం రాంపురం, తుంగభద్ర, చిలకల డోన, కల్లుదేవకుంట, వగరూరు, సూగూరు, రచ్చుమర్రి, మాలపల్లి తదితర గ్రామాల్లో క్రిస్మస్‌ సంబరాలకు చర్చిలను ముస్తాబు చేశారు. ఆదివారం అర్దరాత్రి నుంచి సోమవారం వరకు జరిగే క్రిస్మస్‌ సంబరాలు డివిజనల్‌ చైర్మన్‌ రెవ.వేదనాయకం, మాదవరం ఫాస్టర్‌ పిన్ని పురుషోత్తం, యేసయ్య, రాజన్న ఆధ్వర్యంలో చర్చిల్లో ప్రార్థనలకు సిద్ధం చేశారు.

ఆలూరు: క్రిస్మస్‌ సందర్భంగా మండలంలోని చర్చిలను ముస్తాబు చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు మండలంలోని అన్ని గ్రామాల చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

కోసిగి: క్రిస్మస్‌ను పురస్కరించుకుని కోసిగితోపాటు అన్ని గ్రామాల్లో చర్చిలను ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాల అలంకరించారు. క్రైస్తవులు ఆదివారం పిల్లా పాపలతో వస్త్ర దుకాణాలు, కిరాణ షాపుల్లో సందడి చేశారు.

Updated Date - Dec 25 , 2023 | 12:35 AM