సీఎం జగన్‌లో వణుకు మొదలైంది
ABN , First Publish Date - 2023-11-15T00:34:29+05:30 IST
టీడీపీ, జనసేన కలయిక వల్ల సీఎం జగన్ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి
మంత్రాలయం, నవంబరు 14: టీడీపీ, జనసేన కలయిక వల్ల సీఎం జగన్ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. మంగళవారం టీడీపీ మండల కన్వీనర్ పన్నగ వెంకటేశ్ నివాసం వద్ద టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిక్కారెడ్డితో పాటు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.లక్ష్మన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లో జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనసేన, టీడీపీ సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. టీడీపీ విధి విధానాలు, జనసేన విధానా లకు అనుగుణంగా ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసా లను ప్రజలకు వివరించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఆయా పార్టీల నాయకులు పన్నగ వెంకటేశ్, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బూదూరు మల్లికార్జునరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి ఎల్లారెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, విజయరామిరెడ్డి, అశోక్ రెడ్డి, అండే హనుమంతు, నక్కి వెంకటేశ్, నాగరాజు, మేకల నరసింహులు, బెస్త ఈరన్న, యేబు, రాగన్న పాల్గొన్నారు.