Ramakrishna: టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి.. లేకపోతే...
ABN , First Publish Date - 2023-01-22T14:16:55+05:30 IST
కర్నూలు: నగర శివారులోని టిడ్కో ఇళ్లను సిపిఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన..
కర్నూలు: నగర శివారులోని టిడ్కో ఇళ్లను సిపిఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ టిడ్కో ఇళ్లను (Tidco Houses) లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, లేకపోతే ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన (Protest) తెలుపుతామని అన్నారు. ఫిబ్రవరి 22న విజయవాడ (Vijayawada)లో భారీ నిరసన ప్రదర్శన చేస్తామన్నారు. ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం టీడ్కో ఇళ్లకు రంగులు మాత్రమే వేసిందని, కరెంటు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. జగనన్న కాలనీలో ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు, ఉచితంగా ఇసుక, సిమెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ పాదయాత్ర చేశారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారని, అలాగే
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు డీజీపీ అనుమతి ఇవ్వాలని రామకృష్ణ అన్నారు. లేకపోతే శృంగభంగం తప్పదన్నారు.