ఘనంగా ఒలింపిక్‌ రన్‌

ABN , First Publish Date - 2023-06-21T00:02:13+05:30 IST

ఎస్‌ఎంబీ ఫౌండేషన్‌, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్‌ రన్‌ నిర్వహించారు.

ఘనంగా ఒలింపిక్‌ రన్‌
ఒలింపిక్‌ రన్‌లో పాల్గొన్న క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు

కర్నూలు(స్పోర్ట్స్‌), జూన్‌ 20: ఎస్‌ఎంబీ ఫౌండేషన్‌, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్‌ రన్‌ నిర్వహించారు. మంగళ వారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నుంచి ప్రారంభమైన పరుగు రాజ్‌విహార్‌ కిడ్స్‌ వరల్డ్‌, కోట్ల సర్కిల్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు 2 కి.మీల మేర సాగింది. రెండో పోలీసు పటాలం డీఎస్పీ మహబూబ్‌ బాషా, ఎస్‌ఎన్‌బీ ఫౌండేషన్‌ అధినేత ఎస్‌.మహబూబ్‌ బాషా, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామాంజినేయులు కలిసి ఒలింపిక్‌ జ్యోతులను వెలిగించి జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగులో ఇంజనీరింగ్‌ కళాశాల విద్యా ర్థులు ప్రధాన స్టేడియం, బీ.క్యాంపు క్రీడా మైదానంలో ప్రాక్టీసు చేస్తున్న సీనియర్‌ క్రీడాకారులు, 30 క్రీడా సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ పరు గులో పాల్గొని ఉత్సాహాన్నిచ్చారు. పరుగు ప్రారంభానికి ముందు ఫ్రైజ్‌మణీ టూకే రన్‌ను ప్రారంభించారు. ముగింపు కార్యక్రమం కొండారెడ్డి బురుజు వద్ద ముగిసింది. విజేతలైన ఆరుగురికి నగదు బహుమతులు ఇచ్చారు. ఈసందర్భంగా ఎస్‌ఎంబీ అధినేత మహబూబ్‌బాషా మాట్లాడుతూ ఒలిం పిక్స్‌ చేరుకునే జిల్లా క్రీడాకారులకు లక్షల రూపాయలు నజరానాలను ఇస్తా మని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం డీఎస్పీ మహబూబ్‌, ఒలింపిక్‌ సం ఘం అధ్యక్షుడు రామాంజినేయులు విజేతలైన క్రీడాకారులను అభినం దిం చారు. క్రీడా సంఘాలకు చెందిన విద్యార్థుల మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు పలు వురిని అబ్బురపరిచాయి. న్యాయవాది గీతామాదురి, జిల్లా అసోసియేషన్‌ ప్రతినిధి హర్షవర్దన్‌, హాకీ కర్నూలు కార్యదర్శి దాసరి సుధీర్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ కార్యదర్శి షేక్షావలి, అసోసియేషన్‌ వ్యవస్థాపకులు టి.గంగా ధర్‌, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సి.శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-21T00:02:13+05:30 IST