జగన్‌ అవినీతి రారాజు

ABN , First Publish Date - 2023-10-05T00:10:26+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి అవినీతి రారాజు అని నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జీ మండ్రశివానందరెడ్డి అన్నారు.

జగన్‌ అవినీతి రారాజు
నంద్యాల శాంతి ర్యాలీలో భూమా బ్రహ్మానందరెడ్డి

బాబు కోసం మేము సైతం దీక్షలో మాండ్ర ఫ 22వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్షలు ఫ నంద్యాలలో శాంతి ప్రదర్శన ఫ దీక్షలకు జనసేన, సీపీఐ సంఘీభావం

నందికొట్కూరు, అక్టోబరు 4: జగన్మోహన్‌రెడ్డి అవినీతి రారాజు అని నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జీ మండ్రశివానందరెడ్డి అన్నారు. బుధవారం పొట్టిశ్రీరాములు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన సామూహిక రిలే నిరాహారదీక్షను మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జీ గౌరు వెంకటరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ అవినీతిలో కూరుకుపోయిన జగన్‌ ఇతరులపై అవినీతి బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. జగన్మోహన్‌రెడ్డి జైలు పక్షి అని గుర్తుచేశారు. ఆయనపై 38 క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. జగన్‌ను ఎప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన స్పషం్టం చేశారు. మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ గుండం రమణారెడ్డి, కన్వీనర్లు, పాల్గొన్నారు.

కలిసికట్టుగా సైకోను ఎదుర్కోవాలి : గౌరు చరిత

పాణ్యం : వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా సైకోను ఎదుర్కోవాలని నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. చంద్రబుబు అరెస్టుతో పాణ్యంలో టీడీపీ చేపట్టిన నేను సైతం రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 22వ రోజుకుచేరుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల సందర్భంగా చేపట్టిన దీక్షలతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపిందన్నారు. ఈ నెల 9 వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు. ఎంపీటీసీలు నల్లల భాస్కరరెడ్డి, రంగరమేష్‌, మాజీ జెడ్పీటీసి నారాయణమ్మ, గడివేముల నాయకులు సత్యంరెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఫరూక్‌, పాణ్యం కన్వీనర్‌ జయరామిరెడ్డి, రాంమోహన్‌ నాయుడు, రమణమూర్తి, ఖాదర్‌ బాష, సుబహాన్‌, ప్రతాపరెడ్డి, అమరసింహారెడ్డి, మాధవి, ఈశ్వరరెడ్డి, గోరుకల్లు రవి, సురేష్‌, జనసేన సైనికులు సునీల్‌, సుబ్బకృష్ణ పాల్గొన్నారు.

ప్రజావేదికనుకూల్చి విధ్వంసానికి నాంది: భూమా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల (నూనెపల్లె): అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చి విధ్వంసానికి నాంది పలికిందని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బాబు కోసం మేము సైతం కార్యక్రమంలో చేపట్టుతున్న రిలేనిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నంద్యాలలోని వివిధ వార్డుల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూమా బ్రహ్మానందరెడ్డి దీక్షను ప్రారంభించారు. టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు, క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు హిజ్రాలు కూడా దీక్షలకు మద్దతు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ కుట్రతోనే చంద్రబాబు అక్రమ అరెస్టు

ఆత్మకూరు : రాజకీయ కుట్రలో భాగంగానే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారని శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డిమాజి సర్పంచ్‌ కంచర్ల గోవింద రెడ్డి అన్నారు. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలేనిరాహారదీక్షలు 22వ రోజూ కొనసాగాయి. దీక్షలకు జనసేన, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. టీడీపీ మండల, పట్టణాధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, మహానంది మండల అధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు వెన్నా శ్రీధర్‌రెడ్డి, రాజారెడ్డి,నాగూర్‌ఖాన్‌, జాకీర్‌ నందయ్య, హరిప్రసాద్‌,రఘుస్వామి రెడ్డి, మోమిన్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుగుబాటు ఉప్పెనలా మారుతుంది

నంద్యాల (నూనెపల్లె) : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి అగణదొక్కాలని చూస్తే అంతకంతకు తిరుగుబాటు ఉప్పెనలా మారుతుందని టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సత్యమేవ జయతే కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్‌ సెల్‌ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, స్థానిక టీడీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు ఆదాము, మేకల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబురావు, రమేష్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నెహెమియా, ఎస్సీసెల్‌ అధికార ప్రతినిధి రూబెన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-05T00:10:26+05:30 IST