వచ్చే ఎన్నికల్లోజగన్ ఇంటికే : తిక్కారెడ్డి
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:46 AM
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు గమనించారని, మార్పు మొదలైం దని... వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ మంత్రా ల యం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
మంత్రాలయం, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు గమనించారని, మార్పు మొదలైం దని... వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ మంత్రా ల యం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మంత్రా లయం ఓల్డ్‌టౌన్‌లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ మండల కన్వీనర్ పన్నగ వెంకటేశ్, వ్యాసరాజాచార్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, విజయరామిరెడ్డి, పవన్, వడ్డెప్పగారి నరసింహులు, ఎంపీటీసీ మేకల వెంకటేశ్, చిన్నభీమన్న, యేబు, పేతురు, శివ, సుంకప్ప, హనుమంతు, అండే హనుమంతు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.