జగన్ నిరంకుశ పాలనపై పోరాటం
ABN , First Publish Date - 2023-10-05T00:35:24+05:30 IST
జగన్ నిరంకుశ పాలనపై పోరా డాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 4: జగన్ నిరంకుశ పాలనపై పోరా డాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ధర్నా చౌకు వద్ద ఆ పార్టీ ఇన్‌చార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహారదీక్షకు వై.నాగేశ్వరరావు యాదవ్‌తో కలిసి దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈసంద ర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జగన్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపేందుకే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రజల మధ్యకు వచ్చారని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసి 25 రోజులు కావస్తున్నా అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు రెండు రోజులు జ్యూడిషియల్ కస్టడి నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ జరిపారని, ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేక పోయారన్నారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకలు నాగరాజు యాదవ్, అబ్బాస్, పరమేష్, పాల్‌రాజు, గున్నామార్క్, చిన్నమ్మి, వినోద్, ప్రభాకర్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.