LokeshPadayatra: పీలేరు అభ్యర్థిని ప్రకటించిన లోకేష్‌

ABN , First Publish Date - 2023-03-05T18:22:19+05:30 IST

నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (Nallari Kishore Kumar Reddy)ని పీలేరు టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు.

LokeshPadayatra: పీలేరు అభ్యర్థిని ప్రకటించిన లోకేష్‌

తిరుపతి : యువగళం పాదయాత్ర వేదికగా పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (Nallari Kishore Kumar Reddy)ని పీలేరు టీడీపీ అభ్యర్థిగా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా పీలేరు (Pileru)లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భూకబ్జాలను నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ధైర్యంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. మంత్రి పెద్దిరెడ్డి నుంచి రూ.500 కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని కాపాడారని తెలిపారు. పీలేరుకు చింతల రామచంద్రారెడ్డి (Chintala Ramachandra Reddy) ఎమ్మెల్యేగా ఉన్నా.. ముగ్గురు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ పీలేరును దోచేస్తున్నారని దుయ్యబట్టారు. పీలేరుకు పెద్దఎత్తున పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం జగన్‌రెడ్డి (CM Jagan Reddy) పాలనలో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఒరిగిందేమీ లేదన్నారు. జగన్ దగ్గర ఉన్న ఐదుగురు రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. జగన్‌ పాలనపై రెడ్డి సామాజికవర్గ ప్రజలు పునరాలోచించాలని లోకేష్‌ సూచించారు. టీడీపీ వచ్చాక ఉద్యోగులు, పోలీసుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో జాబ్ క్యాపిటల్ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఏపీ వచ్చేది.. ఇప్పుడు గంజాయి క్యాపిటల్‌ అని సెర్చ్‌ చేస్తే ఏపీ వస్తుందని తెలిపారు. టెన్త్ విద్యార్థులతో గంజాయి విక్రయం, వినియోగం చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వచ్చాక గంజాయి స్మగ్లర్లను తరిమికొట్టే బాధ్యత తమదేనని లోకేష్‌ స్పష్టం చేశారు.

‘‘విశాఖ సమ్మిట్‌ (Visakha Summit)లో రూ.76 వేల కోట్లు పెడతామని ఓ కంపెనీ వచ్చింది. గూగుల్‌లో చూస్తే ఆ కంపెనీ పెట్టుబడి కేవలం రూ.లక్ష. ఆ కంపెనీ పులివెందులదని తెలిసింది. కేవలం 50 మంది ఉండే మరో కంపెనీ.. రూ.వేల కోట్ల పెట్టుబడి పెడుతుందట.. నమ్ముదామా?. వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల చీటి అబద్ధం. ఏపీకి వచ్చిన బంగారం లాంటి సంస్థలు వెనక్కిపోయాయి. జగన్‌ 8వ సారి కరెంట్ చార్జీలు పెంచబోతున్నారు. జగన్‌రెడ్డి ఓ కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్. పులివెందుల కంపెనీలకు భూములు కట్టబెడుతున్నారు. జగన్‌ పాలనలో ముస్లింలు కష్టాలు, అవమానాలు పడుతున్నారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అక్రమంగా ఇసుకను బెంగళూరుకు తరలిస్తున్నారు. పాపాల పెద్దిరెడ్డి కన్నుపడితే ఏభూమి అయినా గోవిందా. హంద్రీనీవా సహా ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. చెక్‌ డ్యామ్‌లు కొట్టుకుపోతే మరమ్మతులు చేయలేదు. పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లిని కలిపి జిల్లా చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలి’’ లోకేష్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-05T18:49:00+05:30 IST