Home » YuvaGalamLokesh
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
తన పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీని అమలు చేసేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతమైంది.
యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన తొలి హామీ నెరవేర్చడానికి యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 11.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకున్నారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.
సీఎం జగన్‌కి (CM Jagan) స్టార్టప్ అంటే తెలియదని.. ఆయనకి తెలిసింది ఒక్కటేనని దోచుకో... దాచుకోవడమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పరిశ్రమలు తీసుకొస్తాం. ఆర్థిక వనరులు పెంచుతామని హామీ ఇచ్చారు. కియా కంపెనీతో అనంతపురం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని తెలిపారు
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా అభినందించారు. నిన్న నిర్వహించిన యువగళం - నవశకం సభను పరిశీలిస్తే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. . ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన జనసేన అధినేతకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ ఈనెల 20వ తేదీన జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ( Yuvagalam Padayatra ) ముగింపు సభ జరగనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) తెలిపారు. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు కృతజ్ఞతాభినందనలు చెప్పారు.