Yuvagalam: అడవి మార్గంలో లోకేష్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-06-18T21:51:28+05:30 IST
కొండలు, గుట్టల మీదుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సాగింది. ‘యువగళం’లో (Yuvagalam) 130వ రోజు ఆదివారం పది కిలోమీటర్ల దూరం లోకేష్ పాదయాత్ర చేశారు.
రాపూరు: కొండలు, గుట్టల మీదుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సాగింది. ‘యువగళం’లో (Yuvagalam) 130వ రోజు ఆదివారం పది కిలోమీటర్ల దూరం లోకేష్ పాదయాత్ర చేశారు. ఈ నిర్జన దారిలో తమ నాయకుడ్ని ఒంటరిగా వదలడం ఇష్టం లేనట్టు వందలాది మంది యువకులు లోకేష్‌ను అనుసరించారు. సాయంత్రం తెగచర్ల నుంచి మొదలైన పాదయాత్ర గరిమెనపెంట, రామకూరు, గోనెపల్లె మీదుగా రాత్రి విడిది కేంద్రానికి చేరుకుంది. పాదయాత్ర సాగిన అన్ని గ్రామాల్లో లోకేష్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. చంటిబిడ్డలను లోకేష్ చేతుల్లో పెట్టి సంబరపడిపోయారు. గ్రామ గ్రామాన ప్రజలు మంగళహారతులు పట్టారు. ఊరి జనం అంతా కలిసి లోకేష్‌తో గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయి ప్రియ ఆరంభం నుంచి చివరి వరకు నారా లోకేష్ వెంట నడిచారు. కాగా ఇప్పటివరకు లోకేష్ 1,670.4 కిలోమీటర్ల దూరం నడిచారు.