Yuvagalam: ఎవ్వరినీ వదిలిపెట్టను... ఎర్రబుక్లో రాసుకుంటున్నా: నారా లోకేశ్

ABN , First Publish Date - 2023-06-16T21:10:10+05:30 IST

నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తగ్గేదే లేదు. అన్నీ నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు.

Yuvagalam: ఎవ్వరినీ వదిలిపెట్టను... ఎర్రబుక్లో రాసుకుంటున్నా: నారా లోకేశ్

నెల్లూరు: ‘‘నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తగ్గేదే లేదు. అన్నీ నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. అనంతసాగరంలో నిర్వహించిన యువగళం (Yuvagalam) బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ ఆత్మకూరు ప్రజలకు అభిమానం ఎక్కువని కొనియాడారు. మాజీసీఎం ఎన్టీఆర్ (NTR) సోమశిల, కండలేరు ప్రాజెక్టులు పూర్తి చేసి తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తుచేశారు. నెల్లూరు జిల్లా (Nellore District) నుంచే మార్పు మొదలైందని ప్రకటించారు. యువగళానికి ప్రజాదరణ చూసి సీఎం జగన్ (CM Jagan)లో ఫ్రస్ట్రేషన్ వచ్చిందని ఎద్దేవాచేశారు. జగన్ ఫెయిల్యూర్ వ్యక్తి అని సచివాలయం కట్టిన రాజధానిలో పాలన సాగించలేని ఆయన.. మూడు రాజధానులను ఎలా కడతారని నారా లోకేశ్ ఎద్దేవాచేశారు.

ప్రశ్నిస్తే శిరచ్ఛేదం అంటున్నారు

‘‘జాతీయరహదారులు, రహాదారుల్లో మన భాగస్వామ్యం ఉంది. నాలుగేళ్ల పాలనలో రోడ్ల గుంతలకు తట్టెడు మట్టి వేసిన పాపాన పోలేదు. ప్రశ్నిస్తే శిరచ్ఛేదం అంటున్నారు. ఇసుకను కొల్లగొట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయి ప్రమాదంలో పడితే పట్టించుకోలేదు. ఇదేమని ప్రశ్నిస్తే తప్పంటున్నారు’’ అని మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుయ్యబట్టారు. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా కీర్తిని చాటారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్రానికి ఏం చేశారని వైసీపీ నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, టీడీపీ హయాంలోనే సోమశిల, కండలేరు నిర్మాణాలు జరిగాయని తెలిపారు.

Updated Date - 2023-06-16T21:10:10+05:30 IST