Delhi Liquor Scam Case: తీహార్ జైల్లో లొంగిపోయిన మాగుంట రాఘవ

ABN , First Publish Date - 2023-06-12T18:32:41+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ తీహార్ జైల్లో లొంగిపోయాడు. ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో రాఘవ ఉన్నాడు. అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును రాఘవ అభ్యర్థించాడు. రాఘవ భార్య హాస్పిటల్ రికార్డుల పరిశీలించిన తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్ పరిమితిని కుదించి.. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Delhi Liquor Scam Case: తీహార్ జైల్లో లొంగిపోయిన మాగుంట రాఘవ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case)లో నిందితుడు మాగుంట రాఘవ (Magunta Raghava) తీహార్ జైల్లో లొంగిపోయాడు. ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో రాఘవ ఉన్నాడు. అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును రాఘవ అభ్యర్థించాడు. రాఘవ భార్య హాస్పిటల్ రికార్డుల పరిశీలించిన తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్ పరిమితిని కుదించి.. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నిందితుడు జైల్లో లొంగిపోయాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.

ఈ కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్రూవర్‌గా (Approver) మారుతానని శరత్ ముందుకు రావడాన్ని ఈడీ కూడా అంగీకరించింది. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారటాన్ని వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ (AAP) పార్టీ సవాల్ చేస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో ఆప్ నేతలు (AAP Leaders) సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే రౌజ్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) ఆప్ పిటిషన్ దాఖలు చేయనున్నది. లిక్కర్ కేసుకు సంబంధించి అనేక కీలక అంశాలను ప్రత్యేకించి శరత్ చంద్రారెడ్డికి సంబంధించి గతంలో దర్యాప్తు సంస్థలు ఆయనపై మోపిన అభియోగాలు సహా పలు కీలక అంశాలను పిటీషన్‌లో ప్రస్తావించేందుకు ఆప్ సిద్ధమైంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్‌గానే లిక్కర్ కేసులో పరిణామాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టులో సవాల్ చేయాలని ఆప్ భావిస్తోంది.

Updated Date - 2023-06-12T18:32:41+05:30 IST