Buggana Rajendranath: విజన్ స్టేట్‌మెంట్ ప్రతీ వ్యవస్థకు అవసరం
ABN , First Publish Date - 2023-12-04T13:35:05+05:30 IST
Andhrapradesh: జీఎస్టీ మిత్ర, జ్ఙాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్, విజన్, మిషన్ వ్యాల్యూస్‌లను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విజన్ స్టేట్మెంట్ ఉండటం ప్రతీ వ్యవస్థకు చాలా అవసరమన్నారు. ఆర్థిక శాఖలో స్టేట్ ట్యాక్సెస్‌కు ఒక విజన్ ఇచ్చిన ఈ రోజు తన జీవితంలో మరిచిపోలేనిదన్నారు.
అమరావతి: జీఎస్టీ మిత్ర, జ్ఙాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్, విజన్, మిషన్ వ్యాల్యూస్‌లను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విజన్ స్టేట్మెంట్ ఉండటం ప్రతీ వ్యవస్థకు చాలా అవసరమన్నారు. ఆర్థిక శాఖలో స్టేట్ ట్యాక్సెస్‌కు ఒక విజన్ ఇచ్చిన ఈ రోజు తన జీవితంలో మరిచిపోలేనిదన్నారు. వ్యాట్ కంటే ముందు నుంచీ ఉన్న వ్యవస్ధలో సంస్కరణలు చేశామన్నారు. ట్యాక్స్ అనేది ట్యాక్స్ కట్టే వారిని అడ్డుకునేలా తయారవకూడదన్నారు. ట్యాక్స్ సేవా కేంద్రాలు చాలా చోట్ల పెట్టామని తెలిపారు. ట్యాక్స్ కట్టేవారి వల్లే దేశం నడుస్తోందన్నారు. వారిని దొంగలుగా చూడకుండా, వారితో ట్యాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని స్ధాయిలలోనూ శిక్షణ అవసరమన్నారు.
1960లో ఉన్న తహశీల్దారుల భాష ఇప్పటి తహశీల్దారుల భాష కంటే బాగుందన్నారు. సీఎం జగన్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్‌కు పూర్తిస్ధాయి స్వేచ్చ ఇచ్చారన్నారు. జీఎస్టీ మీటింగ్‌లో చింతపండుకు ట్యాక్స్ ఉండకూడదని చెప్పానని.. వారు అంగీకరించలేదని తెలిపారు. బ్రిటీషర్స్ పాలనలో చింతపండు మీద ట్యాక్స్ లేకుండా చేశారని తెలిపానన్నారు. చింతచెట్లను వంట చెరకు కోసం నరికివేస్తే చింతపండు కొరత వస్తుందని బ్రిటీషర్స్ చింతపండుపై ట్యాక్స్ లేకుండా చేసి ప్రోత్సహించారన్నారు. ఈ విషయాన్ని మీటింగ్‌లో చెప్పి అంగీకరింపజేసినట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.