Minister Harish Rao: TSPSC పేపర్ లీక్‌పై మంత్రి హరీష్ రావు ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2023-04-02T17:11:24+05:30 IST
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ వ్యవహారంపై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించిన మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) స్పందించారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ వ్యవహారంపై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించిన మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) స్పందించారు. పేపర్ లీక్ ఘటన దురదృష్టకరమన్నారు. పేపర్ లీక్ను ప్రతిపక్షాలు బయటపెట్టాయా? అని, ముందుగా తమ ప్రభుత్వమే గుర్తించిందని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నిందితులను జైలులో వేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే పరీక్షలు పెడతామని, ఉద్యోగాలు ఇస్తామని హరీశ్రావు వెల్లడించారు. విపక్షాలను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లేనని, విపక్షాలను నమ్మి విద్యార్థులు మోసపోవద్దని మంత్రి హరీశ్రావు సూచించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. TSPSC బోర్డు మెంబర్లను కూడా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) నిర్ణయించింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై TSPSC బోర్డు మెంబర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. TSPSCలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Question Paper Leakage)పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేశ్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించి పేపర్ లీకేజీతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్, సురేశ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి సిట్ కార్యాలయానికి తరలించారు. ముగ్గురు నిందితులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
పేపర్ లీకైందని మీకు ఎవరి ద్వారా తెలిసింది? ప్రవీణ్, రాజశేఖర్‌ల వద్ద గ్రూప్-1 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు ఎవరు చెప్పారు? గతంలో ఇలా ఏవైనా పేపర్లు లీక్ చేసినట్లు మీ దృష్టికి వచ్చిందా? ప్రవీణ్ (Praveen), రాజశేఖర్ (Rajasekhar) లు మీకు ప్రశ్నపత్రాన్ని ఫ్రీగా ఇచ్చారా? డబ్బులు తీసుకున్నారా? మీరు ప్రశ్నపత్రాన్ని ఎంతమందికి ఇచ్చారు? ఇలా అనేక కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితులు ఒకటి రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమతో ఉన్న పరిచయం కొద్దీ ప్రవీణ్ ప్రశ్నపత్రం ఇచ్చాడని, దాన్ని వాట్సాప్‌లో షేర్ చేశాడని, తాము ఇతరులెవరికీ ఇవ్వలేదని షమీమ్, సురేశ్‌లు సమాధానం చెప్పినట్లు తెలిసింది. కాగా.. రాజశేఖర్‌తో ఉన్న స్నేహం కారణంగానే తనకు ప్రశ్నపత్రం ఇచ్చాడని రమేశ్ చెప్పినట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రానికి ఏది అడిగినా ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. మెదక్ జిల్లా శివ్వంపేటలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మెడికల్, నర్సింగ్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు, కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆరోపించారు. తొమ్మిదేళ్ల కాలంలో డీజిల్, పెట్రోల్‌పై రూ.89,967 కోట్లను సెస్‌ల రూపంలో కేంద్రం తెలంగాణ ప్రజల నుంచి దోచుకుందని ఆయన ఆరోపించారు.