Minister RK Roja: నేతలకంటే ప్రజలే ఎంతో సంతోషంగా ఉన్నారంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2023-07-26T18:20:21+05:30 IST

ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan) రోజూ ప్రజల ఇళ్ల వద్దకు పంపుతున్నారు. రాష్ట్రంలో నాయకులకంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.

Minister RK Roja: నేతలకంటే ప్రజలే ఎంతో సంతోషంగా ఉన్నారంటూ మంత్రి రోజా వ్యాఖ్యలు..

గుడివాడ, కృష్ణాజిల్లా: గుడివాడ నియోజవర్గం అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ఇన్‌ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja), ఎమ్మెల్యేలు కొడాలి నాని (Kodali Nani), పేర్ని నాని, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల నివేదికలను అధికారులు సమర్పించారు. జిల్లాలో మత్స్యశాఖ లేఅవుట్‌ల మంజూరుపై అధికారులను మంత్రి రోజా నిలదీశారు.


"ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan) రోజూ ప్రజల ఇళ్ల వద్దకు పంపుతున్నారు. రాష్ట్రంలో నాయకులకంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలు అడగకుండానే ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో ప్రజలందరూ జగన్ కు మద్దతుగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు జగనన్నను ఎంత అభిమానిస్తారో, గుడివాడ ప్రజలు కొడాలి నానిని అంతే అభిమానిస్తున్నారు." అని మంత్రి రోజా అన్నారు.

Updated Date - 2023-07-26T18:22:33+05:30 IST