Andhra Pradesh : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూళ్లల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం
ABN , First Publish Date - 2023-08-28T18:18:54+05:30 IST
ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు..
అమరావతి : ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల్లో అధికారులు పలు కండిషన్లు పెట్టారు. పాఠశాలలకు విద్యార్థులు (Students) మొబైల్ ఫోన్లు తేవడంపై పూర్తి నిషేధం విధించడం జరిగింది.
ఈ టైమ్‌లో మాత్రమే..!
అంతేకాదు.. టీచర్లు (Teachers) కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపైనా నిషేధం విధించింది విద్యాశాఖ. తరగతి గదుల్లోకి వెళ్లే ముందు టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి (Head Master) అప్పగించాలని విద్యాశాఖ సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. అయితే.. మధాహ్నం భోజన విరామ సమయంలో, ఇతర విరామ సమయాల్లో మొబైల్ వినియోగించవచ్చని విద్యాశాఖ తెలిపింది.తిరిగి హెడ్‌మాస్టర్‌కు అప్పగించి.. పాఠశాల సమయం ముగిసిన తర్వాత తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ఎందుకిలా అంటే..?
కాగా.. బోధన సమయంలో ఎటువంటి ఆటంకం రాకుండా, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పూర్తి ఏకాగ్రత పాఠ్యాంశాల మీదనే ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. పాఠశాల విద్యా శాఖ ఈ చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించామని.. ఆ తర్వాత ఉత్వర్వులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.