CBI: ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
ABN , First Publish Date - 2023-04-16T21:24:18+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)కి మరోసారి సీబీఐ (CBI) అధికారులు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)కి మరోసారి సీబీఐ (CBI) అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. హైదరాబాద్ సీబీఐ ఆఫీస్‌లో అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. పులివెందులలోనే నోటీసులు అందజేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ సీబీఐ ఆఫీస్‌లో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగుసార్లు విచారించారు.
కాగా మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం అరెస్ట్ చేసిన అధికారులు.. ఇదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)కి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్ (Remand Report)లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. 10 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకం ఉందని సీబీఐ అభియోగం పోపింది. హత్యకు ముందు, తర్వాత నిందితులు భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి (Devi Reddy Sivashankar Reddy), వైఎస్ భాస్కర్‌రెడ్డి కలిసి పథకం ప్రకారమే వివేకాను హత్య చేయించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ ప్రస్తావించింది. సాక్ష్యాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. విచారణకు భాస్కర్‌రెడ్డి సహకరించట్లేదని, ఆయన పారిపోయే అవకాశముందనే అరెస్ట్ చేశామని పేర్కొంది. కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందనే అరెస్ట్ చేశామని సీబీఐ (CBI) తెలిపింది.