TDP MP: రైళ్లలో జర్నలిస్టుల రాయితీపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ గల్లా
ABN , First Publish Date - 2023-07-26T15:33:12+05:30 IST
రైళ్లలో జర్నలిస్టుల రాయితీ అంశంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. కోవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: రైళ్లలో జర్నలిస్టుల రాయితీ అంశంపై లోక్‌సభలో (Loksabah) టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ (TDP MP Galla Jayadev) ప్రస్తావించారు. కోవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి (MP Narender Modi) ఎంపీ విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభలో రూల్ 377 కింద స్పెషల్ మెన్షన్ ద్వారా ఈ అంశాన్ని ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. జర్నలిస్టులు వృత్తిరీత్యా విస్తృతంగా ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. జర్నలిస్టులకు కోవిడ్-19 ముందు వరకు రాయితీ ఇచ్చిందని.. కోవిడ్-19 తర్వాత మిగతా అన్ని రాయితీలను పునరుద్ధరించినప్పటికీ జర్నలిస్టు రాయితీలను పునరుద్ధరించలేదని అన్నారు. రాయితీల ద్వారా రైల్వేకు ఏటా రూ.50 వేల కోట్ల భారం పడుతోందని తెలుసన్నారు. అయినప్పటికీ జర్నలిస్టులకు రాయితీలు లేకపోవడం వల్ల వారిపై అదనపు భారం పడుతోందని చెప్పారు. కోవిడ్ ముందు కాలంలో ఉన్న తరహాలో రాయితీలు పునరుద్ధరించాలని ప్రధానిని కోరుతున్నట్లు స్పెషల్ మెన్షన్‌లో ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు.