AP News: వారాహి యాత్ర పోస్టర్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2023-06-05T19:36:38+05:30 IST
వారాహి యాత్ర (Varahi Yatra) పోస్టర్‌ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కత్తిపూడి జంక్షన్
గుంటూరు: వారాహి యాత్ర (Varahi Yatra) పోస్టర్‌ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కత్తిపూడి జంక్షన్ నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోలవరం జగనన్న పాపం పథకంగా మారిందని దుయ్యబట్టారు. డబ్బుల కోసం పోలవరం ఎత్తు తగ్గించారని ఆరోపించారు. సీఎం జగన్ (CM Jagan) హడావుడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారు? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. పవన్ వారాహి యాత్ర నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై గోదావరి జిల్లాల నేతలకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. యాత్రలో అన్నివర్గాల ప్రజలను పవన్ కలిసేలా ప్రణాళిక రచించారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారు.