Chandrababu arrest: చంద్రబాబు విజన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’.. జగన్ రెడ్డి విజన్ ‘కిల్ డెవలప్‌మెంట్’..

ABN , First Publish Date - 2023-09-13T22:12:42+05:30 IST

చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమంగా కేసు నమోదు చేశారని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అన్నారు. చంద్రబాబు పేద విద్యార్ధులకు మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి కిల్ డెవలప్‌మెంట్ సిద్ధాంతంతో యువత జీవితాలు నాశనం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.

Chandrababu arrest: చంద్రబాబు విజన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’.. జగన్ రెడ్డి విజన్ ‘కిల్ డెవలప్‌మెంట్’..

విజయవాడ: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనలేకనే అక్రమంగా కేసు నమోదు చేశారని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అన్నారు. చంద్రబాబు పేద విద్యార్ధులకు మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి కిల్ డెవలప్‌మెంట్ సిద్ధాంతంతో యువత జీవితాలు నాశనం చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా కేసు పెట్టకూడదని కానిస్టేబుల్‌కి సైతం తెలుసునని, కానీ డీఐజీ స్థాయి అధికారికి తెలియకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.


స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఎలాంటి స్కామ్ లేదని, లావాదేవీలన్నీ క్లియర్‌గా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నా ఇంకా ఏదో ఉందని ఆరోపించడం సిగ్గుచేటు రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధి కోసం అధికారాన్ని వాడితే.. జగన్ రెడ్డి కక్ష సాధింపులకు మాత్రమే అధికారాన్ని వాడి వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాడని అన్నారు. కక్ష సాధింపు తప్ప జగన్ రెడ్డికి ఎలాంటి పరిపాలనా తెలియడం లేదని విమర్శించారు. గతంలో విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు సమయంలో తమ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలున్నాయని చెప్పడం వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని భారీ ప్రచారం చేసుకోవడం వాస్తవం కాదా? అప్పుడు కనిపించని అవినీతి, ఎన్నికల సమయంలో కక్ష సాధింపు కోసం కనిపించిందా? జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తికి అవినీతి మరక అంటించాలనే ప్రయత్నం సాధ్యం కాదని అన్నారు. ప్రజలతో కలిసి జగన్ రెడ్డి అరాచకాలను ఎదుర్కొంటామని దీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-13T22:12:42+05:30 IST