Nara Brahmani: జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. బ్రాహ్మణి ట్వీట్
ABN , First Publish Date - 2023-10-13T12:17:51+05:30 IST
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు, లోకేష్ సతీమణి బ్రహ్మణి ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అమరావతి: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోడలు, లోకేష్ సతీమణి బ్రహ్మణి (Nara Brahmani) ట్విట్టర్ వేదికగా తెలిపారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయవిదారమని ఆవేదన చెందారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. చంద్రబాబు క్షేమం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేసినందున ఆయనకు తక్షణ వైద్య సహాయం అవసరమన్నారు. చంద్రబాబుకు సకాలంలో వైద్యం అందడం లేదని తెలిపారు. చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గడం ఆయన కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబసభ్యులమంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామని నారా బ్రహ్మణి ట్వీట్ చేశారు.