Nara Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రపై లోకేష్ కీలక యోచన!!..

ABN , First Publish Date - 2023-09-24T11:36:49+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill case) చంద్రబాబు నాయుడు అరెస్టు (Chandrababu arrest), తదనంతర పరిణామాలపై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆదివారం పలువురు ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Nara Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రపై లోకేష్ కీలక యోచన!!..

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో (Skill case) చంద్రబాబు నాయుడు అరెస్టు (Chandrababu arrest), తదనంతర పరిణామాలపై టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆదివారం పలువురు ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.


వచ్చేవారం యువగళం పున:ప్రారంభం!!

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిపోయిన యువగళం పాదయాత్ర పున: ప్రారంభంపైనా ముఖ్యనేతల సమావేశంలో చర్చించారు. చ్చేవారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించాలని యోచిస్తున్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే ఆయన యువగళం ప్రారంభించనున్నారు. ఇదిలావుండగా చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్ నిత్యం సంప్రదింపులు చేస్తున్న విషయం తెలిసిందే. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ..ఇటు యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని ఈ సమావేశం నిర్ణయం తీసుకున్నారు.

లోకేష్ క్యాంప్ కార్యాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు

రాజమహేంద్రవరంలోని లోకేష్ క్యాంప్ కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ నుంచి ర్యాలీగా వస్తున్న ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడానికి దారులన్నీ మూసివేశారు. ఇప్పటికే వేలల్లో ఐటీ ఉద్యోగులు రాజమంత్రి చేరుకున్నారు. ఎట్టి పరస్థితుల్లో భువనేశ్వరి, బ్రహ్మణిలను పరామర్శించి తీరుతామని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-24T11:37:10+05:30 IST