Lokesh Padayatra: 300 కి.మీ పాదయాత్ర పూర్తయ్యాక.. నారా లోకేశ్ కీలక ప్రకటన చేయబోతున్నారా..!?

ABN , First Publish Date - 2023-02-18T21:28:29+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) నేటితో 300 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించనుంది.

Lokesh Padayatra: 300 కి.మీ పాదయాత్ర పూర్తయ్యాక.. నారా లోకేశ్ కీలక ప్రకటన చేయబోతున్నారా..!?

తిరుపతి: టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) నేటితో 300 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించనుంది. పాదయాత్ర 22వ రోజైన ఈనెల 17వ తేదీ శుక్రవారం రాత్రి బస చేరేసరికి లోకేశ్‌ మొత్తం 296.6 కిలోమీటర్ల దూరం నడిచారు. 18వ తేదీ శనివారం మహాశివరాత్రి (Maha shivratri) పర్వదినం సందర్భంగా పాదయాత్ర (Padayatra)కు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. 23వ రోజైన ఆదివారం శ్రీకాళహస్తి (srikalahasti) పట్టణ శివార్లలోని క్యాంపు సైట్‌ నుంచీ 3.4 కిలోమీటర్లు నడిస్తే 300 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించినట్టవుతుంది.

కాగా పాదయాత్ర 8వ రోజైన ఈనెల 3వ తేదీ బంగారుపాలెంలో వంద కిలోమీటర్ల మైలురాయిని దాటిన లోకేశ్‌.. అనంతరం 16వ రోజైన ఈనెల 11వ తేదీన కార్వేటినగరం మండలం కత్తిరిపల్లి వద్ద 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. వంద కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా బంగారుపాలెంలోని ప్రభుత్వ ఆస్పత్రికి డయాలసిస్‌ పరికరాలు ఉచితంగా లోకేశ్‌ అందజేశారు. 200 కిలోమీటర్ల మైలురాయి దాటిన సందర్భంలో కార్వేటినగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం 23వ రోజు పాదయాత్రలో తొలి రెండు గంటలోనే శ్రీకాళహస్తి మండలం తొండమానుపురం దిగువవీధిలో ఆయన 300 కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు.

Updated Date - 2023-02-18T21:28:31+05:30 IST