నెల్లూరులో పట్టపగలే గ్యాంగ్‌ రేప్‌

ABN , First Publish Date - 2023-06-12T04:07:32+05:30 IST

తోబుట్టువు అనారోగ్యంతో ఉంటే.. సాయం కోసం ఆమె చెల్లెలు శ్రీకాకుళం నుంచి నెల్లూరులోని ఓ ఆస్పత్రికి వచ్చింది.

నెల్లూరులో పట్టపగలే గ్యాంగ్‌ రేప్‌

కిడ్నాప్‌ చేసి 9 మంది అఘాయిత్యం

యువతిని ఆటోలో తీసుకెళ్లిన నలుగురు

వారితోపాటు మరో ఐదుగురూ అత్యాచారం

పోలీసుల రాకతో నిందితులు పరార్‌

ఆటో నంబరు, సీసీ ఫుటేజీతో గాలింపు

నెల్లూరు(క్రైం): జూన్‌ 11: తోబుట్టువు అనారోగ్యంతో ఉంటే.. సాయం కోసం ఆమె చెల్లెలు శ్రీకాకుళం నుంచి నెల్లూరులోని ఓ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు రాసిన చీటీ తీసుకుని మందుల కోసం ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లింది. ఇదే అదనుగా నలుగురు కామాంధులు ఆదివారం పట్టపగలే ఆ యువతిని కిడ్నాప్‌ చేశారు.. నగర శివారుకు సమీపంలోని ఓ ఊరిలో తన అక్క ఇంటికి నెల క్రితం వచ్చింది. ఆమె అక్కకు అనారోగ్యంగా ఉండటంతో నగరంలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. ఈ క్రమంలో అక్కకు తోడుగా ఆస్పత్రిలో ఉంటున్న ఆ యువతి ఆదివారం మధ్యాహ్నం మందుల కోసం గాంధీబొమ్మ సెంటర్‌కు వచ్చింది. అదే సమయంలో ఓ ఆటోలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. నగర శివారులోని గొలగమూడి రోడ్డుకు వెళ్లే మార్గంలో ఓ ప్రైవేటు స్కూల్‌ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా మరో ఐదుగురిని పిలిపించి వారితో కూడా ఆ యువతిపై అత్యాచారం చేయించారు. అటుగా వెళుతున్న స్థానికులు ఆ యువతి కేకలు విని 112కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు ఆ యువతిని వదిలేసి ఆటోతోపాటు పరారయ్యారు. నగరంలోని వేదాయపాళెం పోలీసులు బాధితురాలినిస్టేషన్‌కు తరలించి ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో నంబరును సైతం స్థానికులు తెలియజేయడంతో సీసీ పుటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-06-12T04:07:32+05:30 IST