బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2023-04-22T21:34:20+05:30 IST
కేంద్రం అమలు చేస్తున్న పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంకు జీఎం ఎం.భాస్కరచక్రవర్తి తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యా
కెనరా బ్యాంకు జీఎం
పొదలకూరు, ఏప్రిల్ 22: కేంద్రం అమలు చేస్తున్న పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంకు జీఎం ఎం.భాస్కరచక్రవర్తి తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు ఉన్న వారంతా ఈ బీమా పథకాలకు అర్హులేనని అన్నారు. ఈ పథకంలో నమోదు చేసేందుకు జూన్ 30 వరకు ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించాలని బ్యాంకర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రదీప్‌కుమార్, పొదలకూరు కెనరా బ్యాంకు మేనేజర్ నాగనాథ్, నెల్లూరు రీజనల్ ఆఫీస్ సిబ్బంది, పొదలకూరు బ్యాంకు శాఖ సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.
----------