సర్టిఫికెట్‌ కోసం పాఠశాల ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2023-02-17T22:26:48+05:30 IST

పట్టణంలోని న్యూ ఇన్‌ఫాంట్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల యాజమాన్యం తమ కుమారుడి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదంటూ బాధిత విద్యార్థి మహేష్‌కుమార్‌ తండ్రి మాల్యాద్రి శుక్రవారం పాఠశాల ఎ

సర్టిఫికెట్‌ కోసం పాఠశాల ఎదుట ధర్నా
17కేఎల్‌జీ02: పెట్రోల్‌ సీసాతో పాఠశాల ముందు బైఠాయించిన విద్యార్థి తండ్రి

కలిగిరి, ఫిబ్రవరి17: పట్టణంలోని న్యూ ఇన్‌ఫాంట్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాల యాజమాన్యం తమ కుమారుడి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదంటూ బాధిత విద్యార్థి మహేష్‌కుమార్‌ తండ్రి మాల్యాద్రి శుక్రవారం పాఠశాల ఎదుట పెట్రోల్‌ సీసాతో బైఠాయించారు. మాల్యాద్రి కథనం మేరకు, తన కుమారుడు, కుమార్తెను నర్సరీ నుంచి పదవ తరగతి వరకు న్యూ ఇన్‌ఫాంట్‌ పాఠశాలలో చదివించానని తెలిపాడు. యాజమాన్యం తెలిపిన మేరకు ఫీజులు చెల్లించినా ఇంకా పెద్దమొత్తంలో బాకీ ఉన్నానంటూ, అది చెల్లిస్తేనే సర్టిఫికెట్‌ ఇస్తామని నాలుగు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నదన్నారు. ఈవిషయమై ఇన్‌చార్జి ఎంఈవో రవికుమార్‌కు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆయన పేర్కొన్నాడు. ఈవిషయమై కరస్పాండెంట్‌ విష్ణును వివరణకోరగా తాను అందుబాటులో లేనని కలిగిరికి రాగానే విద్యార్థి తండ్రికి సర్టిఫికెట్‌ అందచేస్తానని తెలిపారు.

-------

Updated Date - 2023-02-17T22:26:49+05:30 IST