Chandrayaan-3: చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

ABN , First Publish Date - 2023-07-14T15:35:01+05:30 IST

శ్రీహరికోట: చందమామపై చెరగని ‘ముద్ర’ వేయడానికి.. అంతరిక్ష ప్రయోగరంగంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేసే.. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే.. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: చందమామపై చెరగని ‘ముద్ర’ వేయడానికి.. అంతరిక్ష ప్రయోగరంగంలో భారత కీర్తి ప్రతిష్టల్ని మరింత ఇనుమడింపజేసే.. స్వదేశీ పరిజ్ఞానంపై మన నమ్మకాన్ని మరింత పెంచే.. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో వర్గాల్లో ఆనందం వెల్లువెత్తింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది.

చంద్రయాన్-3 రాకెట్‌ (Chandrayaan-3 Rocket)ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని శుక్రవారం ప్రయోగించారు.

Untitled-4.jpg

చంద్రయాన్‌-3 బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.613 కోట్లు. 3,900 కిలోల బరువు గల చంద్రయాన్‌-3.. ఆగస్టు 23వ తేదీ లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్‌ అవుతుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని చెప్పారు.

Updated Date - 2023-07-14T15:38:57+05:30 IST